బ్యాంకాక్ లో షూటింగ్ ముగించుకున్న ‘1-నేనొక్కడినే’

Nenokkadine
మహేష్ బాబు కెరీర్ లోనే అందరూ విడుదలకోసం ఎదురుచూస్తున్న చిత్రం ‘1-నేనొక్కడినే’ ఈరోజు బ్యాంకాక్ షెడ్యూల్ ను ముగించుకుంది. పీటర్ హెయిన్స్ సారధ్యంలో ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఈ చిత్రం బృందం నెలరోజులుగా బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుతున్న విషయం తెలిసినదే

ఈ సినిమాకు సంబంధిన నిర్మాతలలో ఒకరైన అనీల్ సుంకర ఈరోజు పుట్టినరోజును జరుపుకున్నారు.ఈరోజు ఏంటో ప్రత్యేకంగా చేసినందుకు సూపర్ స్టార్ కు సినిమా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్న నేపధ్యంలో సుకుమార్ ఈ సినిమాలో చిన్న సన్నివేశాలను కుడా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ దశ త్వరలోనే ముగియనున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 25నుండి మంగళూరులో మొదలుకానుంది. నిర్మాతలు ఈ సినిమాను 2014 జనవరిలో విడుదల చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.

కృతి సనన్ హీరోయిన్ గా పరిచయంకానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనీల్ సుంకర ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

Exit mobile version