డిసెంబర్ లో ప్రారంభంకానున్న నాగచైతన్య కొత్త చిత్రం

naga-chayatana-latest-still

‘తడాఖా’ సినిమాతో మరోసారి విజయం రుచి చూసిన నాగచైతన్య ప్రస్తుతం ‘మనం’ సినిమా షూటింగ్ తో పాటూ ‘ఆటోనగర్ సూర్య’ సినిమాను కూడా షూటింగ్ లో కూడా పాల్గొనున్నాడు.

శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నాగ చైతన్య ‘హలో బ్రదర్’ సినిమాలో నటించాల్సివుండగా అది ప్రస్తుతానికి ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఆకుల శివ చెప్పిన స్టొరీలైన్ నాగ చైతన్యకు నచ్చేసిందట. ఈ సినిమా డిసెంబర్ 21నుండి ప్రారంభంకానుంది

ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించనుంది. సి.కళ్యాణ్ నిర్మాత. అనూప్ రూబెన్స్ స్వరాలను అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం

Exit mobile version