3 డి చిత్రం చెయ్యబోతున్న అనుష్క?

అనుష్క కి వచ్చే అవకాశాలు చూస్తుంటే తను తన స్టార్ డం ను ఎలా మేనేజ్ చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. రజిని కాంత్ తో మొదలుకొని కమల్ హాసన్ విక్రమ్,సూర్య ఇలా ప్రతి ఒక్కరు తన డేట్స్ కోసం అడుగుతున్నారు. సినిమా చిత్రీకరణ షెడ్యూల్ కూడా తనకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. మలయాళం దర్శకుడు వినయాన్ అనుష్క తో 3 డి చిత్రం కోసం అనుష్కను సంప్రదించారు ఈ చిత్రానికి మాతృక బ్రాం స్త్రోకేర్ చేసిన “డ్రాకులా ” చిత్రం. ఈ చిత్రానికి అనుష్క ఇంకా డేట్స్ ఇవ్వలేదు. కొంత భాగం రోమానియా లో చిత్రీకరిస్తారు. ఈ చిత్రాన్ని మలయాళం,తెలుగు,తమిళ మరియు హిందీ భాషలలో విడుదల చేస్తారు .

Exit mobile version