తనపై వస్తున్న కొత్త పుకార్లను కొట్టిపడేసిన హన్సిక

hansika

సినీ తారలు పుకార్ల పరంపరలో మునిగితేలడం పెద్ద విచిత్రంకాదు. వాటిల్లో భాగంగా ఈ మధ్య హన్సిక పలు పుకార్లలో చిక్కుకుంది.
అందులో తాజా వార్త ఏమిటంటే హన్సిక బిగ్ బాస్ అనే రియాలిటి షోలో నటిస్తుంది అనే వార్త. ఆసల ఈ బిగ్ బాస్ షో ఏంటా అని అనుకుంటున్నారా??
ఇది ఒక హిందీ రియాలిటీ షో. ప్రముఖలను కలిపి కొన్ని రోజులపాటు ఒక ఇంటిలో వుంచుతారు. ఆఖరివరకూ ఎవరైతే ఆ ఇంట్లో వుంటారో వారే విజేతలు.

ఈ పుకార్లకు హన్సిక ముగింపు పలుకుతూ “నేను ఎటువంటి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనటం లేదు. ప్రస్తుతం నా ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో బిజీగా వున్నాను. పుకార్లను ఇంతటితో ఆపితే మంచిది” అని ట్వీట్ ఇచ్చింది.

Exit mobile version