ఒకరోజు ఆలస్యంగా రానున్న పోటుగాడు

potugadu-manchu.jp

మంచు మనోజ్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ రానున్న శుక్రవారం అనగా సెప్టెంబర్ 13న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. తాజాగా ఈ రోజు ఇచ్చిన పేపర్ ప్రకటన ద్వారా ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా అనగా సెప్టెంబర్ 14 రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిన్నే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ వారు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అచ్చు సంగీతం అందించిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ మూవీలో మంచు మనోజ్ సరసన సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్ ముండి, అనుప్రియ గోయెంక, రేచల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘గోవిందాయ నమః’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘పోటుగాడు’కి పవన్ వడేయార్ డైరెక్టర్. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష లగడపాటి నిర్మిస్తున్న ఈ సినిమా విజయంపై మంచు మనోజ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Exit mobile version