లవ్ ఫెయిల్యూర్ తన కెరీర్ నే మార్చేసిందట

Rejina
ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. ‘ఎస్.ఎం.ఎస్’, ‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాలలో హీరోయిన్ గా నటించిన రేజీనా. ఇంతకీ ఆమె చెప్తుంది తన జీవితంలో లవ్ ఫెయిల్యూర్ గురించి కాదండీ. తాను నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా గురించి. అదేంటి ‘లవ్ ఫెయిల్యూర్’ లో నటించింది అమలా పాల్ కదా అని అనుకుంటున్నారా?? నిజానికి ఈ సినిమా ఒక లఘు చిత్రాన్ని ఆధారం చేసుకుని తీసింది. ఆ సినిమాలో హీరోయిన్ గా రేజీనా నటించింది. అదన్నమాట సంగతి. అందుకే లవ్ ఫెయిల్యూర్ తో తన జీవితమే మారిపోయింది అంటుంది ఈ భామ. ప్రస్తుతం ఈమె చేతుల్లో నాలుగు చిత్రాలు వున్నాయి. మారుతి దర్శకత్వంలో ‘కొత్తజంట’ సినిమాపై మన హీరోయిన్ చాలానే ఆశలు పెట్టుకుంది.

Exit mobile version