సీనియర్ సినిమా జర్నలిస్ట్ మరియు ప్రముఖ పీఆర్ఓ లగడపాటి బాబురావు(47) ఇక లేరు. గత కొద్ది రోజులుగా కాన్సర్ తో భాదపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. బాబురావు గారు తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఆయనికి పెళ్లి కాలేదు. ఆయన ప్రముఖ దినపత్రికలు ఆంధ్రజ్యోతి, సాక్షి లకు పనిచేశాడు. అలాగే ఆయన చాలా సినిమాలకు పీఆర్ఓ గా పనిచేశారు. డా. మోహన్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్, శేఖర్ కమ్ముల వంటి చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులతో ఆయనకి పరిచయం వుంది. ఈ విషయం మాకు చాలా భాధ కలిగిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాం.