భారీ యాక్షన్ సీన్స్ ని సింగిల్ టేక్ లో చేస్తున్న ఎన్.టి.ఆర్

Ramayya-Vasthayya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ప్రస్తుతం ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పిన డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా షూటింగ్ అప్డేట్స్ ని కూడా తెలియజేశారు.

‘ 1000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్, అన్నీ రిస్క్ తో కూడుకున్న సీన్స్ అయినా సరే ఎన్.టి.ఆర్ సింగల్ టేక్ ఆర్టిస్ట్. సూపర్బ్ హీరో’ అని ట్వీట్ చేసాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ రోజుతో సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ‘ క్లైమాక్స్ చివరి రోజు. ఇక ఒక రోజు టాకీ పార్ట్ మరియు 3 పాటలు మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. సినిమాని చాలా ఫాస్ట్ గా షూట్ చేసాము. ఆ విషయంలో మాకే ఆశ్చర్యంగా ఉందని’ హరీష్ శంకర్ ట్వీట్ చేసాడు. బాలన్స్ ఉన్న మూడు పాటల్లో రెండు పాటల్ని త్వరలోనే స్పెయిన్ లో షూట్ చేయనున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version