యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రబృందం రెండు పాటల చిత్రీకరణకై త్వరలో స్పెయిన్ వెళ్లనుంది. ఒక పాటలో ఎన్.టి.ఆర్, సమంత లు ఆడిపాడితే మరొక పాటలో ఎన్.టి.ఆర్ సరసన శృతి చిందేయనుంది. కొన్ని అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటల చిత్రీకరణ జరగనుందని సమాచారం
ఇండస్ట్రీలో వున్న మంచి డాన్సర్లలో ఎన్.టి.ఆర్ ఒకరు. దర్శకుడు హరీష్ శంకర్ పాటలను అందంగా చిత్రీకరించగలడు. మరి వీరిద్దరూ కలిస్తే ఎంతటి ఘనమైన పాటలను చూస్తామా అని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. లొకేషన్ల విషయంలో, సంగీతం విషయంలో ప్రొడక్షన్ టీం ఎక్కడా రాజీపడటంలేదు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత