రేపటినుండి భాయ్ రీ రికార్డింగ్ మొదలుపెట్టనున్న దేవి శ్రీప్రసాద్

bhai rr

‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పనులను దేవి రేపటినుండి మొదలుపెట్టనున్నాడు. ‘భాయ్’ సినిమా సెప్టెంబర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక సెప్టెంబర్ 1న వుండచ్చు.

ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనబడనున్న నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచివ్వగల దర్శకులలో ఒకరైన వీరభధ్రమ్ చౌదరి ఈ సినిమాకు దర్శకుడు

రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు

Exit mobile version