మంచు మనోజ్ ‘పోటుగాడు’ ఆడియో రిలీజ్ డేట్

Potugadu
యంగ్ హీరో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘పోటుగాడు’ త్వరలో విడుదలకావడానికి సిద్దమవుతోంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని ఆగష్టు 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలోని రెండు పాటలు ‘బుజ్జి పిల్ల’, ‘దేవత’ లకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి అచ్చు సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ వడయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. సిమ్రాన్ ముండి, నతాలియా, సాక్షి లు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Exit mobile version