స్పెయిన్ లో సందడి చేయనున్న ఎన్.టి.ఆర్

NTR-Samantha-Shruthi-Hassan
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా వచ్చే నెలలో విడుదలకావడానికి సిద్దమవుతోంది. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరగనుందని తెలిపాము. ఇప్పుడు అదే విషయాన్ని ఈ సినిమా పీఆర్ఓ తెలియజేశాడు. ఈ నెల 26న స్పెయిన్ లో రెండు పాటలను షూట్ చేయనున్నారు. ఒక పాటని ఎన్.టి.ఆర్ – సమంతలపై, మరొక సాంగ్ ని ఎన్.టి.ఆర్ – శృతి హసన్ లపై చిత్రీకరించనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version