మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘తుఫాన్’. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. రేపటితో ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు ముగియనున్నాయి. కొద్ది రోజుల క్రితమే రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసాడు. సెప్టెంబర్ 6న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది.
అపూర్వ లఖియా డైరెక్ట్ చేసిన ఈ సినిమాని హిందీ(జంజీర్), తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. తెలుగు వారి కోసం సినిమాలో చిన్న చిన్న మార్పులు చేసారు వాటన్నిటినీ డైరెక్టర్ యోగి పర్యవేక్షించారు. రియల్ స్టార్ శ్రీ హరి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.