23న వెంకీ – రామ్ ల ‘మసాల’ ఆడియో రిలీజ్ కానుందా?

venkatesh-and-ram-for-golma
విక్టరీ వెంకటేష్ – రామ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘మసాల’. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఆడియో ఆగష్టు 23న రిలీజ్ కానుంది. ఈ విషయంపై ఈ చిత్ర నిర్మాత త్వరలోనే అధికారకంగా అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘బోల్ బచ్చన్’ సినిమాకి రీమేక్. అంజలి – షాజన్ పదమ్సీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కథలో కొన్ని మార్పులు చేసారు. స్రవంతి రవికిషోర్ – దగ్గుబాటి సురేష్ బాబులు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version