‘ రవితేజతో నేను తీసిన షాక్ పెద్ద ఫ్లాప్ అయినా రవితేజ నన్నెప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ గా చూడలేదు. ‘మిరపకాయ్’ చేసే చాన్స్ ఇచ్చి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అందుకే రవితేజ లేని నా ఫిల్మ్ కెరీర్ లేదు. అలాగే ‘షాక్’ సినిమాతో మనకి ఏది వచ్చో అదే చెయ్యాలి రాని దాన్ని ముట్టుకోకూడదనే విషయాన్ని తెలుసుకున్నానని’ హరీష్ శంకర్ అన్నాడు.
హరీష్ శంకర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.