ఆర్.ఎఫ్.సిలో సందడి చేస్తున్న కార్తికేయ టీం

nikhil-siddharth-and-swathi‘స్వామి రా రా’ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ‘స్వామి రా రా’ తో నిఖిల్ కి హిట్ పెయిర్ గా నిలిచిన స్వాతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

‘కార్తికేయ’ సినిమా ఒక గుడి చుట్టూ తిరిగే థ్రిల్లర్ సినిమా అని సమాచారం. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బివి శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Exit mobile version