హార్ట్ అటాక్ కోసం ఒకవారం హైదరాబాద్ షెడ్యూల్

Nithin-with-Puri

యంగ్ హీరో నితిన్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ఈ సినిమాకి ‘హార్ట్ అటాక్’అనే టైటిల్ ని ఖరారు చేసారు. వారం రోజులు జరగబోయే ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత షూటింగ్ స్పెయిన్ కి మారుతుంది. ఇద్దరి హీరోయిన్స్ ఉండే ఈ సినిమాలో ఆద శర్మ ఒక హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.

పూరి జగన్నాథ్ ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మాములుగా పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ అనగానే వైష్ణో మీడియా గుర్తొస్తుంది, కానీ ఈ సారి ఆయన ఆ బ్యానర్ పై కాకుండా ‘హార్ట్ అటాక్’ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.

Exit mobile version