విజయ్ నిరహరణదీక్షకు నిరాకరించిన పోలీసులు

Vijay
రెండు రోజుల క్రితం తమిళ నటుడు విజయ్ మరియు అతని ‘తలైవా’ చిత్ర బృందం కలిసి తమిళనాడు ప్రభుత్వం సినిమా విడుదలకు అంగీకరించాలని నిరాహారదీక్ష చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ నిరాహారదీక్షకు పోలీసులు అనుమతివ్వలేదట

‘తలైవా’ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ మరియు నిర్మాత చంద్ర ప్రకాష్ జైన్ ఈ దీక్షకు అంగీకారం ఇమ్మని కోరగా, భద్రతా నేపధ్యాల దృష్ట్యా చెన్నై పోలీసులు వారి అభ్యర్ధనను తిరస్కరించారు. ఈ సినిమాలో విజయ్ సరసన అమలాపాల్ నటించింది. తమిళనాడు, పాండిచెరి మినహా ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది

Exit mobile version