స్విట్జర్ ల్యాండ్ వెళ్లనున్నగోపీచంద్, నయనతార

Gopichand_Nayanatara_New_Mo

మాచో హీరో గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా నిర్మిస్తున్న కొత్త సినిమా షూటింగ్ కోసం వీరు స్విట్జర్ ల్యాండ్ వెళ్లనున్నారు. ఈ సినిమా షెడ్యూల్ సెప్టెంబర్ 1వ తేది నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి బి. గోపాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కనుందని సమాచారం. బాలాజీ రియల్ మీడియా వారు నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక ముఖ్యమైన పాత్రని పోషించానున్నాడని సమాచారం. గోపీచంద్ నటించిన ‘సాహసం’ మంచి విజయాన్ని సాదించింది. ఈ సినిమాతో మరోసారి బారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవలనుకుంటున్నాడు. గతంలో డైరెక్టర్ బి. గోపాల్ మంచి బ్లాక్ బ్లాస్టర్ హిట్ ను అందించాడు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా అయన అంత ఉత్సాహంగా లేడు. ఇంతకు ముందే గోపీచంద్, నయనతార కలిసి భూపతి పాండియన్ సినిమాలో నటించాల్సింది. కానీ ఆ సినిమా రద్దయింది.

Exit mobile version