డైరెక్షన్ చేస్తానంటున్న పూరి తమ్ముడు సాయిరాం శంకర్

Sairam Shankar (1)

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా తెలుగు వారికి పరిచయమై చాలా కాలమే అయ్యింది కానీ ఇప్పటివరకూ కెరీర్లో ఒకటీ రెండు కంటే ఎక్కువ సినిమాలు సక్సెస్ కాలేదు. హీరోగా మంచి సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న సాయిరాం హీరోగా సక్సెస్ అయితే డైరెక్టర్ అవుతానని చెబుతున్నాడు.

ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోగా చెయ్యడం కంటే ముందు దర్శకత్వ శాఖలో పనిచేసారు, భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తారా? అని అడిగితే ‘ తప్పకుండా డైరెక్షన్ చేస్తాను. కానీ దానికంటే ముందు హీరోగా సక్సెస్ అవ్వాలి. కాస్త డబ్బులు సంపాదించాలి. ఆ తర్వాతే డైరెక్షన్ చేస్తాను. వేరే వాళ్ళ డబ్బుతో సినిమా చేయను, నా డబ్బుతోనే చేస్తాను అప్పుడు పోయినా నా డబ్బే పోతుందని’ సాయిరాం శంకర్ అన్నాడు.

సాయిరాం శంకర్ – ఎస్తర్ హీరో హీరోయిన్స్ గా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘1000 అబద్దాలు’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయంపై సాయిరాం శంకర్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

Exit mobile version