తన అందం, నటనతో ఆకట్టుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా సౌత్ ఇండియన్ పాపులన్ హీరోయిన్స్ లో ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్ లో తన సత్తా చూపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్స్ లో మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా అంటే ఇష్టమని, హీరోల్లో అయితే హృతిక్ రోషన్ డ్రీం హీరోఅని చెప్పింది.
అలాగే మిల్క్ బ్యూటీ ‘ దేవుడు మరో జన్మకి చాన్స్ ఇస్తే మాధురీ దీక్షిత్ లా పుట్టడానికి ఇష్టపడతానని’ తన మనసులోని మాటని బయటపెట్టింది.
తమన్నాని ఇండస్ట్రీలో తనకున్న ఫ్రెండ్స్ గురించి అడిగితే ‘ నాకు నయనతార, సమంత, కాజల్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అలాగే తను ఫుడ్ లవర్ అని, ఫిష్ కర్రీ, హైదరాబాద్ బిర్యాని, పంజాబీ వంటకాలంటే తనకి ఇష్టమని’ కూడా చెప్పింది.
చివరిగా తన ఫిట్ నెస్ కి సంబందించిన సీక్రెట్ గురించి అడిగితే ‘రెగ్యులర్ గా యోగ, మెడిటేషన్ చేయడమే తన ఫిట్ నెస్ సీక్రెట్’ అని చెప్పింది.