ఆద శర్మ తో రొమాన్స్ చేయనున్న నితిన్

Adoh sharma
యంగ్ హీరో నితిన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి తీస్తున్న సినిమా ‘హార్ట్ ఎటాక్’. ఈ సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ నటి ఆద శర్మ హీరోయిన్ గా నటించనుంది. ఒక కొత్త నటి కోసం గాలించి చివరిగా ఆమెని ఫైనలైజ్ చేసినట్లు నితిన్ తెలియజేశాడు. ఈ సినిమాలో మరో నటి నటించే అవకాశం వుంది. ఆమె పేరు త్వరలో తెలియజేయవచ్చు. ఈ నెల 30 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం వుంది. పూరి జగన్నాథ్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఆద శర్మ గతంలో ‘ఫిర్’, ‘1920’ సినిమాలలో నటించింది.

Exit mobile version