బాలీవుడ్ వెళ్లనున్న మాస్ మహారాజ??

raviteja-in-balupu
‘బలుపు’ సినిమా గెలుపుతో మాంచి ఉత్సాహంమీద వున్న రవితేజ త్వరలోనే బాలీవుడ్ లో తన మొదటి సినిమా చెయ్యనున్నాడని సమాచారం. ఇప్పటికే రానా, రామ్ చరణ్ వంటి తెలుగు నటులు బాలీవుడ్ కధలకి మేకప్ వేసుకున్నారు. ఇప్పుడు రవితేజ కూడా అదే బాట పట్టనున్నాడని సమాచారం. ‘యమ్లా పగ్లా దీవానా’ చిత్ర దర్శకుడు సమీర్ కార్నిక్ ఈ సినిమాను తెరకేక్కించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలుకావచ్చు ‘బలుపు’ విజయాన్ని ఆస్వాదిస్తున్న రవితేజ తన తరువాతి ప్రాజెక్ట్ ను ఇప్పటివరకూ తెలుపలేదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version