రజినీకాంత్ ఇంటర్నేషనల్ స్టార్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ

Rajani-and-Deepika

బాలీవుడ్ లో తన అందంతో, నటనతో బాగా ఫేమస్ అయిన హాట్ బ్యూటీ దీపికా పడుకొనే తాజాగా చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫుల్ ఖుషీ ఖుషీగా ఉంది. అలాగే తన రాబోయే సినిమా ‘కొచ్చాడియన్’ విషయంలో దీపికా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఈ సినిమా గురించి దీపికా మాట్లాడుతూ ‘ ఇదొక ఇంటర్నేషనల్ మూవీ ఎందుకంటే రజినీకాంత్ సార్ ఉన్నారు కదా. ‘కొచ్చాడియన్’ సినిమా రష్యన్, జపనీస్, చైనీస్, తమిళ్, తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారని’ చెప్పింది.

అలాగే ‘ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ పరంగా రజినీకాంత్ కూతురు మరియు ఈ సినిమా డైరెక్టర్ సౌందర్య అశ్విన్ ఎంతో కేర్ తీసుకుంటోందని, ఈ సినిమాలో చూపించనున్న విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాలోనూ చూపించలేదని’ దీపిక తెలిపింది. ‘కొచ్చాడియన్’ సినిమాని తెలుగులో విక్రమ సింహా గా వస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version