‘ఎన్.టి.ఆర్’ పేరుని ఉపయోగించుకుంటున్న విశాల్

Vishal

తమిళ్ స్టార్ విశాల్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. అలాగే విశాల్ నటించిన కొన్ని సినిమాలు ఇక్కడ మంచి అందుకున్నాయి. ప్రస్తుతం విశాల్ చేస్తున్న ఓ సినిమాకి తెలుగులో ఎన్.టి.ఆర్ పేరుని ఉపయోగించుకోనున్నారు. తమిళంలో విశాల్ హీరోగా, అంజలి – వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమాకి ఒకప్పటి తమిళ స్టార్ హీరో మరియు మాజీ ముఖ్య మంత్రి ‘ఎం.జి.ఆర్(మద గజ రాజ)’ అనే టైటిల్ ని పెట్టారు. తమిళంలో ఈ పేరు అందరికీ త్వరగా రీచ్ అవుతుంది. తెలుగులో కూడా అదే రీతిలో సినిమా టైటిల్ అందరికీ చేరుకోవాలనే దానికోసం ‘ఎన్.టి.ఆర్(నటరాజ తనయ రాజ)’ అనే పేరుని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ అంటే ఆంధ్ర ప్రదేశ్ లో తెలియని వారంటూ ఎవరూ ఉండరు కావున ఈ సినిమాకి ఎన్.టి.ఆర్ అని టైటిల్ పెడితే ఈ సినిమా పబ్లిసిటీకి బాగా హెల్ప్ అవుతుందని వారు భావిస్తున్నారు. సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి విజయ్ అంథోని మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Exit mobile version