టి సినిమాపై స్పెషల్ డాక్యుమెంట్ రెడీ చేస్తున్న ఎన్.శంకర్

N-Shankar

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెరాస పార్టీ అధినేత కెసిఆర్ రాష్ట్ర ఏర్పాటుతో పాటు తెలంగాణ సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నారు. దీని కోసం తెలంగాణ నిర్మాతలను, నటీనటులకు, టెక్నీషియన్స్ కీ మేలు కలిగేలా, మళ్ళీ తెలంగాణ సినిమా రంగాన్ని పునరుద్దించడానికి వీలుగా ఓ విజన్ డాక్యుమెంట్ తయారు చేయమని కెసిఆర్ ఎన్ శంకర్ కి సూచించారని సమాచారం. అలాగే కెసిఅర్ ఆంధ్రాకి చెందిన బడా నిర్మాతల చేతిలోనే స్టూడియోలు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లు, అలాగే తెలంగాణ ప్రాంత్రంలోని 300 వందల థియేటర్స్ వారి చేతుల్లో ఉన్నాయని, దాంతో తెలంగాణ నిర్మాతలకి థియేటర్లు దొరకడం లేదని తెలియడంతో కెసిఆర్ షాక్ తిని తెలంగాణ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్ళేలా ఓ సరికొత్త బ్లూ ప్రింట్ తయారు చెయ్యమని డైరెక్టర్ శంకర్ కి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తెలంగాణ సినిమా రంగంపై తయారు చేయనున్న డాక్యుమెంట్ విషయాన్ని గురించి ఎన్. శంకర్ ని అడిగితే ‘ నేనిప్పుడు ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ చెప్పలేను. అలాగే ఇంకా అది తొలి దశలోనే ఉంది. కానీ దీంతో మేము టాలీవుడ్ ని ఓ లెవల్ కి తీసుకేల్తాము అలాగే థియేటర్స్ విషయంలో గుత్తాధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తామని’ తెలిపాడు

Exit mobile version