టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఇలియానా, తమన్నా, కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా నయనతార కూడా ఓ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని చేజిక్కించుకుంది కానీ చివరి నిమిషంలో ఈ బ్యూటీ ఆ అవకాశాన్ని వదులుకుంది. టిప్స్ హౌస్ ప్రొడక్షన్ వారు ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమా కోసం నయనతారని సెలెక్ట్ చేసారు. కానీ ఆ సినిమా అనుకున్న సమయానికి మొదలు కాకుండా ఆలస్యం అవుతుండడంతో నయనతార తన కాల్షీట్ డేట్స్ ఇబ్బంది వల్ల బాలీవుడ్ అవకాశాన్ని వదులుకుంది.
మాకు తెలిసిన సమాచారం ప్రకారం హిందీ సినిమాలో చేయనున్న పాత్ర పట్ల నయనతార ఎంతో ఆసక్తికరంగా ఉనింది. కానీ పరిస్థితులు తారుమారు అవడంతో బాలీవుడ్ తొలి సినిమా షాహిద్ కపూర్ సరసన చేసే అవకాశం మిస్ అయ్యింది. దాంతో నయనతార సౌత్ ఇండియన్ సినిమాలపై దృష్టి పెట్టింది. నయనతార చివరిగా ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘గ్రీకు వీరుడు’ సినిమాల్లో నటించింది.