మాయ చెయ్యబోతున్న నీలకంట

neelakantam
‘షో’, ‘మిస్సమ్మ’, ‘విరోధి’ వంటి ప్రయోగాత్మక సినిమాలను తీసిన దర్శకుడు నీలకంట. ఇప్పుడు ఈ దర్శకుడు ఒక వినూత్న ప్రయత్నానికి తెరలేపాడు. ‘మాయ’ అనే పేరు పెట్టిన ఈ సినిమాకు ఎం ఎం.వి.కె రెడ్డి నిర్మాత. “అతీంద్రియ దృష్టి నేపధ్యంలో ఈ కధను తెరకెక్కిస్తున్నారు. కొత్త తరహాలో సాగే ఈ కధకు స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఈ సినిమా సమర్పకుడు మాట్లాడుతూ “వినూత్న కధలను తెరకెక్కించడంలో నీలకంట దిట్ట. ఆయన నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్రమిది. సెప్టెంబర్ లో చిత్రీకరణ జరగనుందని”తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారు

Exit mobile version