‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ సినిమాకు ‘యు/ఏ’

Pusthakamlo-Konni-Article-r
‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు ‘యు/ఏ’ ఇచ్చారు. ఈ సినిమా శుక్రవారం విడుదలకు సిద్దంగావుంది. ఈశుక్రవారం విడుదలకానున్న అతితక్కువ సినిమాలలో ఇదిఒకటి. తేజ తీసిన ‘1000 అబద్ధాలు’ సినిమా ఆరోజే విడుదలకావాల్సివుంది, కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగష్టు 15కి మారినట్లుగా తెలుస్తుంది

‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ సినిమాకు సాజిద్ ఖురేషి దర్శకుడు. సోహైల్ అన్సారి నిర్మాత. శ్రీ మరియు సుప్రజ హీరో, హీరోయిన్స్. గున్వంత్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన ‘నాదవుల కొంజెం పక్కత్ కానుమ్’ సినిమాకు రీమేక్

ప్రస్తుతం శ్రీ కెరీర్ అగమ్యగోచరంగా మారింది. ఈ సినిమాతోనైనా తన కెరీర్ పుంజుకుంటుందేమో చూద్దాం

Exit mobile version