పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాకి యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ‘నిన్ను చూడగానే’ పాటలో దేవీశ్రీ కూడా తెరపై కనిపించనున్నాడు. దేవీశ్రీ స్క్రీన్ పైన ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తాడని మనకు తెలుసు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్, సమంతలతో కలిసి దేవీశ్రీ కూడా తెరపై కనిపించడం ఆడియన్స్ కి స్పెషల్ ట్రీట్ అనే చెప్పుకోవాలి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. పూర్తి కామెడీగా సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సెన్సార్ వారు కూడా యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా అనుకున్న దాని ప్రకారం ఆగష్టు 7న రిలీజ్ కావాలి కానీ సీమాంధ్ర లో జరుగుతున్నా ఆందోళనల వల్ల విడుదల వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని నిర్మాతలు అనొఉన్స్స్ చేసే అవకాశం ఉంది.