ఎనర్జిటిక్ హీరో రామ్ ఆంధ్రప్రదేశ్ లో మంచి పేరును సంపాందించుకున్నాడు. కానీ ఇప్పుడు తను నేషనల్ థాయ్ బాక్సింగ్ తో అక్కడి వారిని కూడా ఆకట్టుకున్నాడు. రామ్ కి డాన్సింగ్ స్కిల్స్, ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. దానితో తను బాక్సింగ్ స్కిల్స్ ని ఒక కోచ్ ముందు ప్రదర్శించడం జరిగింది. ఆ స్కిల్స్ చూసి తను మెచ్చుకున్నాడు అన్న విషయాన్ని రామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘ నేను థాయిలాండ్ లోని ముయి థాయ్ క్లాసులకు హాజరయ్యాను. నా మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ చూసి వారు చాలా ఇంప్రెస్ అయ్యారు. అక్కడి కోచ్ నన్ను తన టీంతో కలిసి ఫైట్ చేయమన్నాడు. అలాగే అతనికి నేను ఒక నటున్ని అని తెలియదు. నేను ఒక స్టూడెంట్ ని అనుకున్నాడని’ పోస్ట్ చేశాడు.
రామ్ ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తను ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో కలిసి కనిపించనున్నాడు. ఈ సినిమాలో రామ్ థాయ్ బాక్సింగ్ చేయనున్నాడా? ఈ విషయం తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.