ఈ మధ్య కాలంలో హీరోల కొడుకులు, నిర్మాతల కొడుకులు, కొంతమంది ఆర్టిస్ట్ ల కొడుకులు బ్యాక్ గ్రౌండ్ చూసుకొని వారి వారసులుగా తెరంగేట్రం చెయ్యడం చాలా కామన్ గా జరుగుతున్న విషయం. ఇదే జాబితాలో ‘స్వయం కృషి’, ‘గాయం’, ‘జెంటిల్ మెన్’ మొదలైన సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న చరణ్ రాజ్ కొడుకు తేజ్ రాజ్ కూడా చేరనున్నాడు. ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ‘నన్ను అన్ని భాషల్లోనూ నటుడిగా ఆదరించారు. నా కొడుకు తేజ్ రాజ్ కూడా నటనపై ఆసక్తి చూపడంతో నేను కూడా ప్రోత్సహించాను. ఇప్పటికే డైరెక్టర్ గా పరిచయం చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. త్వరలోనే తొలి చిత్రం ఎలా ఉంటది, ఎవరితో ఉంటదనే విషయాన్ని’ తెలియజేస్తామని అన్నాడు. తేజ్ రాజ్ కూడా మాట్లాడుతూ ‘బాలు మహేంద్ర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నానని, ఇండస్ట్రీలో కచ్చితంగా నిలదొక్కుకోగలననే నమ్మకం ఉందని’ తెలిపాడు.