పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటం రాయుడు’ అనే పాటకి తన గాత్రాన్ని అందించాడు. దానికి సంబందించిన వీడియో సాంగ్ ఈ రోజు విడుదలైంది. అలాగే ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఎంతో జోష్ తో పాడారు. విజువల్స్ సూపర్బ్ గా ఉన్న ఈ వీడియో ని పవన్ ఫ్యాన్స్ మరియు సినీ అభిమానులు బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే పాటకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా కనిపించనుంది. సెకండ్ హీరోయిన్ గా ప్రణిత కనిపించనున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఈ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ఆగష్టు 9న పెద్ద ఎత్తున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.