జనవరి 8న స్నేహితుడు ఆడియో?


బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 3 ఇడియట్స్ చిత్రాన్ని తమిళ్ లో ‘నన్బన్’ పేరుతో రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘స్నేహితుడు’ పేరుతో డబ్ చేయనున్నారు. ఇటీవలే తమిళ్ లో ఆడియో విడుదలై విశేష ఆదరణ చూరగొంది. స్నేహితుడు ఆడియోను జనవరి 8న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. విజయ్, జీవా, శ్రీరామ్ హీరోలుగా ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ హక్కులు దిల్ రాజు దక్కించుకున్నారు. జనవరి 26 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version