స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి. దానయ్య సమర్పిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్-దేవి శ్రీ ప్రసాద్కాంబినేషన్లో వచ్చిన ఆర్య, బన్నీ, ఆర్య 2 చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ ఇద్దరు తమ రేమ్యురేషణ్ తగ్గించారు.