భారీ ఆఫర్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు

mahesh-babu

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తెలియనివారుండరు. ఆయన ప్రచారకర్తగా వ్యవహరించిన కొన్ని కంపెనీల ద్వారా మహేష్ పేరు బాలీవుడ్లో బాగానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఒక బాలీవుడ్ సంస్థ భారీ బడ్జెట్ చిత్రానికి మహేష్ బాబును ఎన్నుకుంది. యు.టి.వి మోషన్ పిక్చర్స్ సంస్థ మహేష్ ను ఒక ఫాన్సీ ధరకు సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రం 2014 వేసవిలో మొదలుకానుంది. ఈలోపు మహేష్ తన మిగిలిన చిత్రాలను పుర్తిచెయ్యనున్నాడు

ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. యు.టి.వి ,మోషన్ పిక్చర్స్ సంస్థ ఇదివరకే మహేష్ తో కలిసి ‘అతిధి’ సినిమాకు పనిచేసింది. తెలుగులో ఇది వారికి రెండో సినిమా, మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘1-నేనొక్కడినే’ సినిమాలో బిజీగావున్నాడు

ఈ కొత్త సినిమాలో హీరొయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కావాల్సివుంది

Exit mobile version