నితిన్, యామి గౌతం జంటగా నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ ‘ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. చాలా కాలం తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఒక పాటను కొన్ని సన్నివేశాలను హైదరాబాద్లో హీరో హీరోయిన్ల నడుమ తీసారు. ఇప్పటికే చాలా శాతం చిత్రీకరణ పూర్తయింది. నితిన్ తన పాత్ర కలిగిన సన్నివేశాలను మరో 20రోజులలో ముగించనున్నాడు. ప్రేమ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మరో దర్శకుడు గౌతం మీనన్ ఫోటాన్ కథాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇదే సినిమాను తమిళ్ లో జై, యామి గౌతం నడుమ తీస్తున్నారు. కార్తీక సంగీతం అందించాడు. ఈ సినిమా బృందాన్ని గౌతం మీనన్ అభినందించాడు. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ ‘ ఆసక్తికరంగా సాగే ఒక రొమాంటిక్ కామెడి సినిమా. ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదలవుతుంది