కర్నూల్ రాక్ గార్డెన్స్ వద్ద బాహుబలి షూటింగ్

Baahibali-Team

దర్శకదిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి తీస్తున్న చర్తిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’ షూటింగ్ మొదలైంది. కర్నూల్ రాక్ గార్డెన్స్ వద్ద బాహుబలి షూటింగ్ జరుపుకుంటుంది. ఇది మంగళవారం వరకూ కొనసాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్, రానా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా కనిపిస్తుంది

‘బాహుబలి’ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది. గత కొన్ని నెలలుగా ప్రభాస్, రానా, అనుష్కలు ఈ ప్రాజెక్ట్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు
కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. టాలీవుడ్ లోనే బెస్ట్ మూవీ కావాలని ఈ సినిమా బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం

Exit mobile version