ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ‘హార్ట్ ఎటాక్’ అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాని పూరి జగన్నాథ్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. పూరి జగన్నాథ్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో సినిమా చేయాలి. కానీ ఈ యంగ్ మెగా హీరోతో చేయవలసిన ప్రాజెక్ట్ ప్రస్తుతానికి వాయిదా పడిందనే చెప్పాలి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రొమాంటిక్ సినిమాలపై ఫోకస్ చేసినట్టు అనిపిస్తోంది. ‘హార్ట్ ఎటాక్’ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఈ స్క్రిప్ట్ ను విని నితిన్ చాలా సంతోషించాడని తెలిసింది. నితిన్ నటించిన ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలు అతని కెరీర్ లోనే వరుసగా పెద్ద హిట్ ను సాదించాయి. ఇప్పుడు నీతిన్ పూరి జగన్నాథ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా కూడా హిట్ సాదిస్తుందని అందరు బావిస్తున్నారు.