కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలను బట్టి సూర్య తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించనున్నాడట. ఈ సంస్థ పేరు డి2 ఎంటర్టైన్మెంట్స్ అని వినికిడి. ఈ పేరుకు అర్ధం సూర్య-జ్యోతికల పిల్లలపేర్లైన దియా మరియు దేవ్ లో మొదటి అక్షరాలు. తమిళ భాషలో కొత్త దర్శకులతో చిన్న బడ్జెట్ సినిమాలతో తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సూర్య ఇప్పుడు కొత్త దర్శకులు తీస్తున్న సినిమాలు బాగున్నాయని, త్వరలో వారితో కలిసి నటిస్తానని తెలిపాడు. ప్రస్తుతానికి దాదాపు సూర్య నటించిన అన్ని సినిమాలు స్టూడియో గ్రీన్ బె=బ్యానర్ పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నాడు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.