సూర్య నటించిన తాజా చిత్రం ‘సింగం(యముడు 2)’ ఈ జూలై 5న రాష్ట్రమంతటా భారీ విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా 2011 లో విడుదలై ఘనవిజయం సాదించిన యముడు సినిమాకు ఇది సీక్వెల్. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య, అనుష్క మరియు హన్సిక ప్రధాన పాత్రధారులు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ వారాంతరంలో ‘సింగం’ మినహా మరే ఇతర అనువాద సినిమాగాని డైరెక్ట్ సినిమాగానీ విడుదలకావట్లేదు. సూర్య కు తెలుగులో మంచి మార్కెట్ ఉండటం, అనుష్క అందాలు తోడవ్వడం ఈ సినిమాకు బోనస్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2355 స్క్రీన్ లలో విడుదలకానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. ఈ సినిమా సౌత్ ఇండియాలో మొదలై సౌత్ ఆఫ్రికాలో ముగుస్తుంది.