ఆ రోజుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న శృతి హసన్

shruti-hassan
శృతి హసన్ జూలై 19 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అవును మీరు వింటున్నది నిజమే…! శృతి హసన్ కి జూలై 19 చాలా ముఖ్యమైన రోజు. తను నటించిన హిందీ సినిమాలు ‘రామయ్యా వస్తావయ్యా’, డి- డే రెండు ఒకే రోజు జూలై 19న విడుదలవుతున్నాయి. ఇవి శృతి హాసన్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలు. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాదిస్తే బాలీవుడ్ తను మంచి స్థానం లబిస్తుంది.

ఇప్పటికే తెలుగులో శృతి హసన్ భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. తను నటించిన హిందీ సినిమాలు కూడా హిట్ ను సాదిస్తాయని చాలా నమ్మకంగా వుంది. ఇప్పటికే శృతి హసన్ నటించిన ‘బలుపు’ సినిమా మంచి విజయాన్ని సాదించింది. ప్రస్తుతం తను తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి ‘రేసు గుర్రం’ సినిమాలో నటిస్తోంది.

Exit mobile version