గ్రేప్ ఫార్మ్స్ లో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్

pawan-kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని గ్రేప్ ఫార్మ్స్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో దాదాపు అందరు స్టార్స్ పాల్గొంటున్నారు. ఆగష్టులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెలలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ ప్రముఖ నటుడు బోమన్ ఇరాని తెలుగు వారికి పరిచయం కానున్నాడు. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ మదర్ గా కనిపించి మార్కులు కొట్టేసిన నదియా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version