త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న నిఖిల్ సినిమా

Nikhil-and-Swathii
చాలా రోజులుగా అప్ అండ్ డౌన్ చూసిన నిఖిల్ కి ఈ సంవత్సరం విడుదలైన ‘స్వామి రారా ‘ సినిమా మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం నిఖిల్ ‘కార్తీకేయ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పై నిఖిల్ భారీగా నమ్మకాన్ని పెట్టుకున్నాడు. కొన్ని వారల క్రితమే ఈ సినిమా ప్రారంభంఅయ్యింది. ఈ సినిమాకి సంబందించిన ప్రధానమైన షూటింగ్ జూలై 5 నుండి ప్రారంభం అవుతుంది. ”కార్తీకేయ’ సినిమా షూటింగ్ జూలై 5 నుండి మొదలవుతుంది. ఈ సినిమా కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని అనుకుంటున్నాను. జై గణేష.. జై కార్తీకేయ స్వామి’ అని నిఖిల్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో నిఖిల్, స్వాతి మరోసారి కలిసి నటిస్తున్నారు. చందు మొండేటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా మొత్తం గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ని వైజాగ్, అరకు, సామర్ల కోటలోని బీమేశ్వరస్వామీ గుడిలో నిర్వహించనున్నారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని వెంకట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version