కమల్ హాసన్ నటిస్తున్న ‘విశ్వరూపం 2’ సినిమా దాదాపు పూర్తయింది. కొన్ని వారాల క్రితం ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను బ్యాంకాక్ ఎయిర్ పోర్ట్ లో తీసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ చెన్నైలో మొదలైంది. ప్రస్తుతం కమల్, రాహుల్ బోస్ నడుమ పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆఫ్గనిస్తాన్ లో బంకర్ ను తలపించే సెట్ ను ఇక్కడ వేసారు. పూజ కుమార్ మరియు ఆండ్రియా ముఖ్య పాత్రధారులు. శేఖర్ కపూర్ కూడా ఒక పాత్ర పోషిస్తున్నాడు. కమల్ స్వయంగా స్క్రిప్ట్ మరియు దర్శకత్వ భాద్యతలను చేపట్టాడు. షాందత్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదలకానుంది