అల్లు అర్జున్, శృతి హాసన్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా పేరు ‘రేస్ గుర్రం’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం యూరోప్ లో రెండో షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో స్విట్జర్లాండ్ లో జెనీవా ప్రాంతంలో హీరో హీరోయిన్ల నడుమ రెండు పాటలను తీస్తారు. దీనికిగాను అల్లు అర్జున్, శృతి హాసన్ రేపు జెనీవా వెళ్లనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డికి ఇదే మొదటిసినిమా. నల్లమల్పు బుజ్జి, డి. వెంకటేశ్వర రావు నిర్మాతలు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అందరి కళ్ళు అల్లు అర్జున్, శృతి హాసన్ మీద ఉన్నాయి. వీరిద్దరూ వంశీ పైడిపల్లి ‘ఎవడు’ లో నటిస్తున్నాఒకరికి జంటగా మరొకరు కనిపించేది మాత్రం ఈ సినిమాలోనే . వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించాడు. థమన్ సంగీత దర్శకుడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్