ఎవడు ఆడియోలో సందడి చేయనున్న స్టార్స్

Yevadu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియోని ఈ రోజు సాయంత్రం విడుదలచేయడానికి వేదిక సిద్దమవుతోంది. ఈ వేదిక స్టార్స్ తో నిండిపోనుంది. అలాగే ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు హాజరుకవచ్చునని సమాచారం. మేము విన్న సమాచారం ప్రకారం ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు రానున్నారు. సుమ ఈ వేడుకకు యాంకర్ గా వ్యవహరించనుంది.
శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూలై చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version