తన కోరిక బయటపెట్టిన రవితేజ

raviteja-in-balupu

మాస్ మహారాజ రవితేజ తెలుగులో ఒక విలక్షణ నటుడు. ఎలాంటి పాత్రలన్నా చేయగల టాలెంట్ ఉంది కానీ రవితేజలో తెలియని ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్లాన్ గురించి ఇలా చెప్పాడు. ‘నాకు నిర్మాత అవ్వాలని అస్సలు లేదు. మనకు సెట్ కానివి చెందు చెప్పండి చెయ్యడం. కానీ ఏదో ఒకరోజు డైరెక్టర్ మాత్రం అవుతాను, అది ఎప్పుడనేది తెలియదని’ రవితేజ అన్నాడు.

ఈ శుక్రవారం రవితేజ తన ‘బలుపు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రవితేజ కెరీర్లో నటుడిగా ఈ సినిమా చాలా కీలకంగా మారింది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని పివిపి సినిమా వారు నిర్మించారు.

Exit mobile version