‘ప్రేమ కధా చిత్రమ్’ విజయం సాదించడంతో ఎనెర్జిటిక్ హీరో సుధీర్ బాబు దగ్గర ఇప్పుడు చేతినిండా అవకాశాలు వున్నాయి. తాజా కధనాల ప్రకారం అతని పాత చిత్రం విజయం కారణంగా ఇప్పుడు మరో సినిమాను అంగీకరించాడు. ఆ సినిమా టైటిల్ పేరు ‘మాయదారి మల్లిగాడు’. ఇప్పటికే ఈ సినిమా పేరుతో సుధీర్ బాబు మామయ్య అయిన సూపర్ స్టార్ కృష్ణగారు అప్పట్లో ఒక సినిమా చెయ్యడం గమనార్హం. ఈ సినిమాతో ఒక కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.