మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. మంచి బజ్ ఉన్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక్క అంశం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతూ వస్తుంది. అదే ఈ సినిమా రిలీజ్ డేట్.
దీనిని మేకర్స్ ఓ సాలిడ్ ట్రీట్ తో రివీల్ చేయనున్నట్టు ఇప్పుడు వినిపిస్తుంది. సో దీనిపై అతి త్వరలోనే ఒక క్లారిటీ రానుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ సినిమా జనవరి 12న విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో వెంకీ మామ కూడా కామియో రోల్ చేస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
